Spoken English ముందుమాట
స్పోకెన్ ఇంగ్లీష్ ని
కాన్వర్జేషన్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా అంటారు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక భాగం. ఇంగ్లీషు భాష మీద మనకు ఎంత పట్టు ఉన్నా దాన్ని ఇతరులకు తెలియజేసే శక్తి కలిగి ఉండాలి. అంటే కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి.
Spoken English |
ఉద్యోగాల్లో గానీ ఏదైనా కోర్సులో గాని ప్రవేశించాలంటే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్ లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ చాలా అవసరం అవుతుంది. మన మాతృభాషలో ఎంత సహజంగా ధారాళంగా మాట్లాడతామొ ఇంగ్లీష్ లో కూడా అంత సహజంగా మాట్లాడాలి.
ఎన్ని డిగ్రీలు పాస్ అయినా ఇంగ్లీషులో మాట్లాడ లేక పోవడానికి కారణాలు రెండు. మాట్లాడగలమా లేదా అనే సందేహం రావడం. రెండోది మాట్లాడితే తప్పులు దొర్లుతాయి ఏమోనే అసలు మాట్లాడకుండా ఉండటం.
ఈ క్రింది విధంగా చేయండి త్వరగా ఫలితాలు సాధిస్తారు.
1. మీకంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడే వాళ్ళతో తరచూ మాట్లాడుతూ ఉండండి.
2. ఎక్కువ ఇంగ్లీషు పుస్తకాలు చదవండి. కొన్ని పదాలకు అర్థం తెలియకపోతే డిక్షనరీ ని చూడండి.
3. ఇంగ్లీష్ పత్రికలు చదవండి అలా చదవడం వల్ల పదజాలం బాగా పెరుగుతుంది.
4. ఇంగ్లీష్ వార్తలు వినండి. దీని వలన ఉచ్చారణతో పాటు పదజాలాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
Note: నోరు తెరచి తప్పు-ఒప్పు ఏదో ఒకటి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉండాలి. కేవలం మాట్లాడే అభ్యాసం చేయకపోవడం వల్లనే. కాబట్టి నోరు విప్పాల్సిందే.
0 comments:
Post a Comment